కాజల్ అగర్వాల్ ఇప్పటికే ‘ముంబై సాగా, ఇండియన్ 2’ చిత్రాల్లో నటిస్తున్న ఆమె మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న ‘ఆచార్య’లో కూడా కథానాయికగా అవకాశం దక్కించుకుంది. ఇలా మొత్తం మూడు పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్న ఆమె చేతికి మరో భారీ చిత్రం కూడా వెళ్ళింది. ఇలయదళపతి విజయ్ – మురుగదాస్ దర్శకత్వంలో ‘తుపాకి 2’ చేయనున్నారు. ఇందులో కథానాయికగా కాజల్ నటించే అవకాశం ఉందని ఇటివలే వార్తలు వచ్చాయి. కాగా ఈ వార్తా దాదాపు నిజమేనని తెలుస్తోంది. ‘తుపాకి’ లో కూడా హీరోయిన్ కాజలే.
అందులో ఆమె పాత్రకు మంచి అప్లాజ్ లభించింది. అందుకే ఈసారి కూడా ఆమెనే రిపీట్ చేయాలని మురుగదాస్ భావిస్తున్నారట. కాజల్ సైతం ఆ మధ్య ఇన్స్టా లైవ్ ద్వారా మాట్లాడుతూ విజయ్ తన ఫేవరెట్ కో స్టార్ అని హింట్ కూడా ఇచ్చారు. దీన్నిబట్టి ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయని, త్వరలోనే అఫీషియల్ క్కన్ఫర్మేషన్ రావొచ్చని అనిపిస్తోంది. ఇకపోతే కాజల్, విజయ్ గతంలో ‘మెర్సల్, జిల్లా’ చిత్రాల్లో కూడా కలిసి నటించారు.