న్యూ లుక్ కోసం స్టార్ హీరో కుమారుడు వర్కౌట్స్ !

తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కుమారుడు ‘ధృవ్’ తెలుగులో సంచలన విజయం సాధించిన ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ తో తమిళంలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొదటి సినిమాతోనే యాంగ్రీ యంగ్ మ్యాన్ క్యారెక్టర్ ద్వారా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐతే కరోనా వల్ల దొరికిన ఖాళీ సమయాన్ని తన వర్కౌట్స్ కి వాడుకుంటున్నాడు ఈ యంగ్ హీరో. తమ ఫామ్ హౌస్ లో ఏకాంతంగా గత కొన్ని రోజులు నుండి తన ట్రైనర్ సాయంతో కొత్త లుక్ కోసం కసరత్తులు చేస్తున్నాడట.

ఇక ఇప్పటికే రెండు స్క్రిప్ట్స్ ను లైన్ లో పెట్టిన ఈ యంగ్ హీరో తన తరువాత సినిమాగా వాటిలో ఏదొక స్క్రిప్ట్ ను ఫైనల్ చేస్తాడట. ఇప్పటివరకు తన తర్వాతి చిత్రాన్ని ప్రకటించని ధృవ్ ప్రస్తుతం కొత్త హెయిర్ స్టైల్ తో పాటు షార్ప్ లుక్ కోసం ట్రై చేస్తున్నాడు. మొత్తానికి ఈసారి కూడా ధృవ్ రఫ్ అండ్ ఎనర్జిటిక్ పాత్రలోనే నటించడానికి ప్లాన్ చేస్తున్నట్లు ఉన్నాడు. మరి ఆ సినిమా ఏమిటి, దర్శకుడు ఎవరు, ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.

Exit mobile version