రావిపూడితో బాలయ్య సంప్రదింపులు ?

స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. కమర్షియల్ ఫార్ములాను ఫాలో అయ్యే దర్శకుల్లో ఫన్ మీద ఎక్కువగా దృష్టిపెట్టే డైరెక్టర్. ఆయన చేసిన సినిమాలు కూడా వరుసగా బ్లాక్ బస్టర్ విజయాల్ని సాధించాయి. అందుకే ఆయనకు డిమాండ్ బాగా పెరిగింది. చిన్న హీరోల దగ్గర్నుండి స్టార్ హీరోల వరకు అందరూ ఆయనతో వర్క్ చేయడానికి సిద్దంగా ఉన్నారు. మరీ ముఖ్యంగా పూర్తిస్థాయి ఎంటెర్టైనర్ చేయాలనుకునే ఆలోచన ఉన్న హీరోలు అనిల్ రావిపూడిని మొదటి ఛాయిస్ కింద చూస్తున్నారు.

కాగా తాజాగా బాలకృష్ణ రావిపూడితో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది బాలయ్య – అనిల్ రావిపూడి కలయికలో ఓ సినిమా వచ్చే అవకాశం ఉందట. ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్ 3 సినిమా స్క్రిప్ట్ తయారుచేసే పనిలో ఉన్నాడు. మరో రెండు వారాల్లో స్క్రిప్ట్ పనులు కూడా పూర్తవుతాయట. ‘ఎఫ్ 2’ సీక్వెల్ లో అందరూ అనుకున్నట్లు మూడో హీరో ఉండరని ఇప్పటికి అనిల్ రావిపూడి ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్పష్టంగా క్లారిటీ ఇచ్చాడు.

Exit mobile version