డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ పై స్టార్ డైరెక్టర్స్ !


కరోనాకి ముందువరకూ సినిమా చూడాలి అంటే, థియేటర్స్ లోనే చూడాలి. లేకపోతే ఆ అనుభూతి మిస్ అవుతాం అనుకున్నే రోజులు పోయాయి. రేపు కరోనా అనంతరం కూడా థియేటర్స్ కి వెళ్లి ఆ గోలలో కేకల మధ్య సినిమా చూడాలా..? అని ప్రేక్షకులు ఇలా అనుకోవచ్చు ఏమో. ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా రిలీజ్ అయితేనే జనం థియేటర్స్ కి వస్తారు. అందుకేమో ఇక అందరూ డిజిటల్ స్ట్రీమింగ్‌ వైపే వెళ్తున్నారు. దాంతో ఫిల్మ్ స్టార్స్ కూడా డిజిటిల్ వైపు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది.

ఇప్పటికే బడా నిర్మాతలు సైతం వెబ్ సిరీస్ లను నిర్మించడానికి సిద్ధం అవుతున్నారు. ఆహా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ కోసం కొరటాల శివ దర్శకత్వ పర్యవేక్షణలో ఒక వెబ్ సిరీస్ ను, వంశీ పైడిపల్లి సహకారంతో రెండు వెబ్ సిరీస్‌ లు రాబోతున్నాయని తెలుస్తోంది. అదే విధంగా వేణు ఉడుగుల, అనిల్ రావిపూడి, చందు మెండేటి, సుకుమార్, వినాయక్ లాంటి వారు ఆహా కోసం వెబ్ సిరీస్ లను నిర్మిస్తున్నారు. అలాగే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా ప్రస్తుతం వెబ్ సిరీస్ కోసం స్క్రిప్ట్ రాస్తున్నాడు. మొత్తానికి ఈ కరోనా కాలంలో డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ కి ఫుల్ డిమాండ్ క్రియేట్ అయింది.

Exit mobile version