బాలయ్యతో డాషింగ్ డైరెక్టర్ ఫిక్స్ ?

బాలయ్యతో డాషింగ్ డైరెక్టర్ ఫిక్స్ ?

Published on Apr 21, 2020 9:10 AM IST

డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లాక్ డౌన్ లో సమయంలో కూడా ఓ స్టార్ హీరో కోసం ఓ ఇంట్రస్టింగ్ స్క్రిప్ట్ రాస్తున్నట్లు కొన్ని రోజుల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఈ విరామం తనకు తాజాగా ఆలోచించడానికి అలాగే భిన్నమైన కథలను వ్రాయడానికి అద్భుతమైన అవకాశం అని పూరి చెప్పుకొచ్చాడు. అయితే పూరి కథ రాస్తోంది బాలయ్య కోసమేనని.. ఇప్పటికే పూరి, బాలయ్యకి ఫోన్ లోనే కథ వినిపించాడని బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.

క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమా తరువాత బాలయ్య – పూరి సినిమానే మొదలవుతుందట. ఇప్పటికే బాలయ్య – పూరి కాంబినేషన్‌లో ‘పైసా వసూల్’ చిత్రం వచ్చింది. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా.. ఆ సినిమాలో బాలయ్యను చాల కొత్తగా చూపించాడు పూరి. అందుకే పూరితో మరో సినిమా చేయడానికి తానూ ఎప్పుడూ రెడీనే అని ఆ మధ్య బాలయ్య కూడా చెప్పుకొచ్చాడు.

ఇక చాన్నాళ్లకు ఇస్మార్ట్ శంకర్ తో భారీ విజయాన్నే నమోదు చేసిన పూరి.. ఆ సక్సెస్ ఇచ్చిన కిక్ తో వరుసగా హిట్స్ కొడతాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు