జూలై-14న సినీతారల క్రికెట్ మ్యాచ్


మళ్ళీ మన తెలుగు హీరోలంతా కలిసి ఒక క్రికెట్ మ్యాచ్ ఆడబోతున్నారు, మ్యాచ్ వివరాలు తెలియజేయడం కోసం విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ ” మొదట్లో హీరోలంతా సరదాగా గడపడం కోసం క్రికెట్ మ్యాచ్ లు ఆడటం మొదలుపెట్టామని, ఆ తర్వాత అది చాలా మందికి సహాయం చేయడం కోసం ఆడుతున్నామని ఆయన అన్నారు. ముందులాగే ఇప్పుడు కూడా అనాధ శరణాలయాలు మరియు వృద్దాశ్రమాలకు సహాయం అందించడం కోసం శ్రీ విజేత గ్రూప్స్ వారు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ మ్యాచ్ జూలై-14న వైజాగ్ లోని డా. వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసిఏ-విడీసీఏ స్టేడియంలో జరగనుందని, ఇక్కడ ఒక 20-20 మ్యాచ్ అడబోతున్నామని ఆయన తెలిపారు. ఇలాంటి మంచి కార్యక్రమాల కోసం టాలీవుడ్ ఎప్పుడూ ముందుంటుందని ఆయన తెలియజేశారు”. హీరో తరుణ్ మాట్లాడుతూ ‘ వైజాగ్లో ఒక మ్యాచ్ ఆడబోతున్నామని అందులో ఒక టీంకి శ్రీ కాంత్, మరో టీంకి తను కెప్టెన్ గా వ్యవహరించబోతున్నామని అన్నారు’. ఈ కార్యక్రమానికి రాజీవ్ కనకాల, ఆదర్శ్, సుదీర్ బాబు, రఘు మరియు చరణ్ తేజ్ తదితరులు హాజరయ్యారు.

Exit mobile version