చిరంజీవి నటించిన ‘స్టాలిన్’ హింది లో ‘జై హో ‘ పేరుతో సల్మాన్ ఖాన్ హీరో గా రీమేక్ చేసారు. సల్మాన్ ఖాన్ తమ్ముడు సోహైల్ ఖాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ట్రైలర్ ఈ రోజు విడుదల అవ్వాల్సి వుండగా ఈ చిత్రం ఇప్పటికే ఇంటర్నెట్ లో ప్రకంపనలు సృష్టిస్తుంది .
ఎ. ఆర్. మురుగు దాస్ దర్శకత్వం వహించిన ‘స్టాలిన్ ‘ చిత్రం సమాజానికి సాయం చేద్దాంఅనుకునే ఒక మిలటరీ ఆఫీసర్ జీవితం చుట్టూ తిరుగుతుంది . ప్రారంభం లో తన కృషి ఎవరు గుర్తించక పోయినా, మెల్లిగా తను సాయం చేసిన ప్రతి ఒక్కరు మరి కొందరికి సాయం చేస్తారు . హింది రీమేక్ లో సల్మాన్ ఖాన్ కి వున్నా ఇమేజ్ ని దృష్టి లో పెట్టుకుని మరి కొంచం ఏక్షన్ ని మేళవించారు. హిందీ ‘స్టాలిన్’ కి పీపుల్స్ మాన్ అని ఉపశీర్షిక పెట్టారు .
టబు,డైసీ షా మరియు సన ఖాన్ ముఖ్య పాత్ర లు పోషించిన ‘జై హో’ చిత్రం జనవరి 26 న విడుదల కానుంది .