ఈ ఏడాది వేసవిలో మెగా అభిమానులకు బంపర్ ఆఫర్

ఈ ఏడాది వేసవిలో మెగా అభిమానులకు బంపర్ ఆఫర్

Published on Jan 4, 2012 8:18 PM IST


ఈ ఏడాది వేసవిలో మెగా అభిమానులకి మెగా పండుగ రాబోతుంది. మెగా క్యాంపు నుండి వేసవిలో మూడు భారీ సినిమాలు రాబోతున్నాయి. మొదటగా మెగా పవర్ స్టార్ నటించిన ‘రచ్చ’ మర్చి నెలాఖరులో రాబోతుండగా పేటర్ హైన్ సారధ్యంలో భారీ యాక్షన్ సన్నివేశాలు రూపొందించారని సమాచారం. తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్’ రాబోతుంది. ఈ మసాలా ఎంటర్టైనర్ ఏప్రిల్ 27న వేసవి సెలవుల్లో విడుదలవుతుంది. ఈ చిత్రం బాలీవుడ్లో వచ్చిన ‘దబాంగ్’ చిత్రానికి రిమేక్. పవన్ కళ్యాణ్ ఫుల్ లెంగ్త్ మాస్ పాత్రలో కనిపించబోతున్నారు. త్రివిక్రమ్ డైరెక్షన్లో అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం మే చివర్లో రాబోతుంది. ఇలియానా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాలన్నీ కలిసి మెగా అభిమానులకు కను విందు చేయనున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు