రామ్ చరణ్‌ ఎంత నేర్చుకున్నాడో చెప్పిన జక్కన్న

జక్కన్న రాజమౌళి ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా ‘ఆర్ఆర్ఆర్’ను రూపొందిస్తున్నారు. ఇటీవలే చరణ్ పుట్టినరోజు సందర్భంగా భీమ్ ఫర్ రామరాజు పేరుతో చరణ్ పోషిస్తున్న అల్లూరి సీతారామరాజు పాత్రను పరిచయం చేశారు. ఈ ఇంట్రడక్షన్ వీడియోకు అన్ని భాషల్లో విశేష స్పందన లభించింది. చరణ్ లుక్, బాడీ లాంగ్వేజ్ అందరినీ ఇంప్రెస్ చేసింది. చెర్రీ స్క్రీన్ ప్రెజెన్స్ ఇంత గొప్పగా ఉండటం పట్ల ఫ్యాన్స్ ఫిధా అయిపోయారు.

రాజమౌళి అయితే సినిమాలో చరణ్ పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతూ ‘మగధీర’ సమయంలో చెర్రీలొ ఒక రానెస్ ఉండేదని, అది ఆ సినిమాకు ఎంతో ఉపయోగపడిందని అంటూ ఈ పదేళ్ళలో చరణ్ ఎంతో నేర్చుకున్నాడు, ‘రంగస్థలం’తో నటుడిగా ఎన్నో మెట్లు ఎక్కాడు, పరిణితి సాధించాడు, నటనను ఎంజాయ్ చేస్తున్నాడు అంటూ కితాబిచ్చారు. ఆయన మాటలు వింటే చరణ్ మరోసారి ఉత్తమ నటనను ప్రదర్శించడం ఖాయమని అనిపిస్తోంది.

Exit mobile version