‘టూరిస్ట్ ఫ్యామిలీ’కి రాజమౌళి ఫిదా..!

తమిళంలో కామెడీ చిత్రాలకు మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇదే కోవలో రీసెంట్‌గా ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ అనే సినిమా తమిళంలో రిలీజ్ కాగా, దానికి ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ దక్కింది. అటు బాక్సాఫీస్ దగ్గర కూడా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. శశికుమార్, సిమ్రాన్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాను అభిషన్ జీవింత్ డైరెక్ట్ చేశారు.

ఇక ఈ సినిమాపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ సినిమాపై దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి తన స్పందన తెలిపారు. ‘టూరిస్ట్ ఫ్యామిలీ అనే అద్భుతమైన చిత్రాన్ని చూశాను. గుండెల్ని హత్తుకునే ఈ కామెడీ చిత్రం మొదట్నుంచీ చివరి వరకు తనకు చాలా నచ్చిందని.. అభిషన్ జీవింత్ రైటింగ్, టేకింగ్ రెండు తనను ఆకట్టుకున్నాయని.. ఇటీవలకాలంలో మంచి చిత్రాన్ని అందించినందుకు చిత్ర యూనిట్‌కు అభినందనలు’ అంటూ జక్కన్న కామెంట్ చేశాడు.

ఇలా ఓ చిన్న సినిమాపై రాజమౌళి కామెంట్ చేయడంతో ప్రస్తుతం ఈ చిత్రం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Exit mobile version