ఎట్టకేలకు ఎస్ ఎస్ రాజమౌళి కల నిజమయ్యింది. “విశ్వరూపం” చిత్ర ఆడియో విడుదల సందర్భంగా హైదరాబాద్ వచ్చిన కమల్ హాసన్ ని ఎస్ ఎస్ రాజమౌళి కలిసారు. ఈ చిత్ర ఆడియో విడుదలకు ముఖ్య అతిధిగా హాజరయిన రాజమౌళి మాట్లాడుతూ ” అందరు భయపడే సమయంలోనే కమల్ హసన్ చాలా ప్రయోగాలు చేశారు. అయన నటిస్తున్న కాలంలో నేను దర్శకుడిగా ఉన్నందుకు గర్వపడుతున్నాను. అయన రాబోతున్న చిత్రం “విశ్వరూపం” చూడటానికి చాలా తహతహలాడుతున్నాను” అని అన్నారు. ఈరోజు రాజమౌళి మరి కొన్ని మధుర క్షణాలను తన ఖాతాలోకి జమ చేసుకున్నారు.మా టీవీ కోసం ఈ విలక్షణ దర్శకుడు కమల్ హాసన్ ని ఇంటర్వ్యూ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా తనే సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమం త్వరలో మా టివిలో ప్రదర్శితం అవుతుంది. కమల్ హాసన్ నిర్మించి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆంద్ర ప్రదేశ్ లో దాసర్ నారాయణ రావు పంపిణి చేస్తున్నారు. కమల్ హాసన్, ఆండ్రియా,పూజ కుమార్ మరియు రాహుల్ బోస్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. శంకర్ -ఎహాసన్- లాయ్ సంగీతం అందించిన ఈ చిత్రం తెలుగు,తమిళ హిందీలలో జనవరి 11న విడుదల కానుంది.
కమల్ హాసన్ ని ఇంటర్వ్యూ చేసిన రాజమౌళి
కమల్ హాసన్ ని ఇంటర్వ్యూ చేసిన రాజమౌళి
Published on Dec 31, 2012 9:13 PM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా
- సమీక్ష : కిష్కింధపురి – ఆకట్టుకునే హారర్ అండ్ యాక్షన్ డ్రామా !
- సమీక్ష : డెమోన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ – విజువల్ ట్రీట్‌తో పాటు ఎమోషనల్ బీట్
- ‘మిరాయ్’లో ప్రభాస్ క్యామియోపై అందరికీ క్లారిటీ!
- పొంగల్ రిలీజ్ కన్ఫర్మ్ చేసిన పరాశక్తి.. జన నాయగన్‌కు తప్పని పోటీ..!
- ఇక వాటికి దూరంగా అనుష్క.. లెటర్ రాసి మరీ నిర్ణయం..!
- పోల్ : మిరాయ్ చిత్రం పై మీ అభిప్రాయం..?
- ‘మిరాయ్’లో కనిపించని పాటలు.. ఇక అందులోనే..?
- ‘మిరాయ్’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా
- సమీక్ష : కిష్కింధపురి – ఆకట్టుకునే హారర్ అండ్ యాక్షన్ డ్రామా !
- సాలిడ్ బుకింగ్స్ కనబరుస్తున్న ‘మిరాయ్’
- ‘కాంతార 1’ కి భారీ ఓటిటి డీల్!
- గ్లోబల్ రీచ్ కోసం ‘కాంతార 1’.. వర్కౌట్ అయ్యేనా?
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సూపర్ స్టార్ “కూలీ”
- హైదరాబాద్‌లో బొమ్మల సినిమాకు ఇంత క్రేజా..?
- సమీక్ష : డెమోన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ – విజువల్ ట్రీట్‌తో పాటు ఎమోషనల్ బీట్