ఆకాశవాణి నుండి తప్పుకున్న ఎస్ ఎస్ కార్తికేయ

ఓ విభిన్నమైన కథతో తెరకెక్కుతున్న చిత్రం ఆకాశవాణి. ఈ సినిమా నుండి రాజమౌళి కుమారుడు ఎస్ ఎస్ కార్తికేయ తప్పుకున్నట్లు, దర్శక నిర్మాతలతో ఆయనకు ఏర్పడిన అభిప్రాయ భేధాలే కారణమని రెండు రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఐతే ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ ఎస్ ఎస్ కార్తికేయ ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఆ నోట్ లో ఆయన అనేక విషయాలు ప్రస్తావించారు.

ఆకాశవాణి మూవీ టీమ్ తో పనిచేయం గొప్ప అనుభూతి అన్న కార్తికేయ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నాను అని చెప్పారు. అందుకు కారణంగా ఆయన ఆకాశవాణి సినిమా దర్శకుడితో వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ అని చెప్పారు. దానితో పాటు మిగతా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండడం వలన కూడా ఈ నిర్ణయం తీసుకున్నాని లేఖలో వివరించారు. ఆకాశవాణి సినిమాకు అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహిస్తుండగా, ఏ. పద్మనాభ రెడ్డి నిర్మిస్తున్నారు.

Exit mobile version