శృతిని బ్రేక్ తీసుకోమంటున్న తల్లి

Shruthi-Hasan-with-her-moth
ప్రస్తుతం టాలీవుడ్ మరియు బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న హీరోయిన్ శృతి హాసన్. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకూ రిలీజ్ అయిన అన్ని సినిమాలకి మంచి రెస్పాన్స్ వచ్చింది, అందులో కొన్ని సూపర్ హిట్స్ గా నిలిచాయి.

ప్రస్తుతం వరుస సినిమాలతో, సినిమా రిలీజ్ ప్రమోషన్స్ తో బాగా బిజీగా ఉన్న శృతి గురించి ఆమె తల్లి సారిక తెగ భయపడిపోతోంది. కాస్త ఖాళీ టైం దొరికితే తను బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తున్న ప్రోడక్ట్స్ కోసం ప్రకటనల షూటింగ్ లో పాల్గొంటూ బిజీ బిజీగా లైఫ్ ని గడిపేస్తోంది. ఈ విషయం పై కేర్ తీసుకుంటున్న ఆమె తల్లి సారిక అసలు ఖాళీ లేకుండా ఉంటున్న శృతికి తను కాస్త బ్రేక్ తీసుకొని కాస్త రిఫ్రెష్ అవ్వాలని సలహా ఇచ్చింది. ఇది కాకుండా నిన్న శృతి చెల్లెలైన అక్షర హాసన్ పుట్టిన రోజు. ప్రస్తుతం శృతి హాసన్ తెలుగులో రామ్ చరణ్ సరసన చేసిన ‘ఎవడు’ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తోంది.

Exit mobile version