బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఎంత క్రేజ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సౌత్ ఇండియన్ ప్రేక్షకులకి షారుఖ్ ఖాన్ సుపరిచితుడే అయినా ఇక్కడ అంత క్రేజ్ లేదు. తాజాగా షారుఖ్ చేసిన ‘రా వన్’, ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ సినిమాలతో సౌత్ లో కాస్త క్రేజ్ ఏర్పడింది.
ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి షారుఖ్ అతని టీం తన రాబోయే సినిమా ‘హ్యాపీ న్యూ ఇయర్’ని తెలుగు, తమిళ భాషల్లో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. షారుఖ్ ఖాన్, అభిషేక్ బచ్చన్, దీపిక పడుకొనే, బొమన్ ఇరానీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి ఫరా ఖాన్ డైరెక్టర్. షారుఖ్ ఖాన్ తన సొంత బ్యానర్లో నిర్మిస్తున్న ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా యష్ రాజ్ ఫిల్మ్స్ వారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. 2014 దీపావళి కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.