రాముని గెటప్ లో బాలయ్య అదుర్స్

రాముని గెటప్ లో బాలయ్య అదుర్స్

Published on Nov 1, 2011 12:57 PM IST

Sri Rama Rajyam 11
శ్రీరామ రాజ్యం చిత్రంలో శ్రీరామ ప్రభువుగా నందమూరి నటసింహం బాలయ్య ఫస్ట్ లుక్ విడుదలైంది. వీటితో పాటు మరికొన్ని ఫొటోస్ నూ నిన్నరిలీజ్ చేసారు. ఈ చిత్రాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. శ్రీరాముని అవతారం లో బాలయ్య తెలుగు సినిమా లెజండ్ స్వర్గీయ యన్టీఆర్ ను జ్ఞప్తికి తెస్తున్నారని అనేక మంది వ్యాఖ్యానిస్తున్నారు.

అలానే సీతా దేవి పాత్రలో నయనతార అద్భుతంగా కనిపించారు. నటీనటులందరి కాస్టూమ్స్ ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి. సుప్రసిద్ధ దర్శకుడు బాపు భక్తి రస మహత్తర చిత్రం ‘శ్రీరామరాజ్యం’ . ఈ సినిమాను యలమంచిలి సాయి బాబా నిర్మిస్తున్నారు.

ఈ చిత్ర ఆడియో ఇప్పటికే విజయవంతమైంది. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సమకూర్చిన స్వరాలకు విశేష స్పందన లభిస్తోంది. నవంబర్ మూడో వారంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆంద్ర ప్రదేశ్ అంతటా ఈ చిత్రాన్ని ఆర్ఆర్ మూవీ మకర్స్ పంపిణీ చేస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు