ఆగుస్టులో విడుదలకు సిద్ధమవుతున్న శ్రీమన్నారాయణ


నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం ‘శ్రీమన్నారాయణ’ షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ చిత్రాన్ని ఆగుస్టులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గతంలో సామాన్యుడు వంటి చిత్రానికి దర్శకత్వం వహించిన రవి చావాలి ఈ చిత్రానికి దర్శకతం వహించారు. శ్రీమన్నారాయణ చిత్రాన్ని దాదాపు 80 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసారు. ఈ చిత్రంలో బాలకృష్ణ జర్నలిస్ట్ పాత్రని పోషిస్తుండగా ఆ పాత్ర ఆయన స్థాయిని పెంచేలా ఉంటుందని చిత్ర దర్శకుడు రవి చావాలి చెబుతున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన ఇషా చావ్లా, పార్వతి మెల్టన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సింహా తరువాత బాలకృష్ణ, చక్రి కాంబినేషన్లో వస్తున్న శ్రీమన్నారాయణ చిత్రాన్ని ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్ పై రమేష్ పుప్పాల నిర్మించారు.

Exit mobile version