టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా మారిన చిత్రం ‘హరిహర వీరమల్లు’ ఈ వారం గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. ఈ సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను క్రిష్, జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేయగా స్టార్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేశారు. ఇక ఈ సినిమాను భారీ అంచనాల మధ్య రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు.
అయితే, ఈ చిత్రానికి సంబంధించిన నైజాం రైట్స్ ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చాయి. ఈ చిత్రాన్ని నైజాం ఏరియాలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమా రైట్స్‌ను వారు భారీ ధరకు దక్కించుకుని ఉంటారని అందరూ అనుకుంటున్నారు. అయితే, సినీ సర్కిల్స్‌లో వినిపిస్తున్న మాట ప్రకారం ఈ చిత్రాన్ని వారు రూ.35 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
అంతేగాక ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు వారు ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ సినిమా నైజాం ఏరియాలో ఎలాంటి కలెక్షన్స్ సాధిస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను జూలై 24న వరల్డ్‌వైడ్ రిలీజ్‌కు రెడీ చేశారు.