నాగార్జున ‘శిరిడి సాయి’లో శ్రీకాంత్ ప్రత్యేక పాత్ర

నాగార్జున ‘శిరిడి సాయి’లో శ్రీకాంత్ ప్రత్యేక పాత్ర

Published on Mar 6, 2012 10:38 AM IST


అక్కినేని నాగార్జున నటిస్తున్న భక్తిరస చిత్రం ‘శిరిడి సాయి’ షూటింగ్ ప్రస్తుతం కులు మనాలిలో జరుగుతుంది. పాపులర్ హీరో శ్రీకాంత్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన బాబా భక్తుల్లో ఒకడిగా నటిస్తున్నారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎ. మహేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. నాగార్జున ఈ చిత్రం కోసం తన లైఫ్ స్టైల్ మరియు ఆహారపు అలవాట్లు పూర్తిగా మార్చుకున్నారు. ఎమ్ఎమ్ కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నాగార్జున, కె. రాఘవేంద్ర రావు మరియు కీరవాణి కాంబినేషన్లో వస్తున్న మూడో భక్తి చిత్రం పై అభిమానుల్లో అంచనాలున్నాయి.

తాజా వార్తలు