మా కథ విని సింగల్ సిట్టింగ్లో ఒప్పుకున్నారు.!

100 సినిమాలు పూర్తి చేసిన క్రికెటర్ లా మన ఫ్యామిలీ హీరో శ్రీ కాంత్ 100 సినిమాలు పూర్తి చేసిన తర్వాత జోరు పెంచి టాప్ స్పీడ్ తో సినిమాలు ఒప్పుకుంటున్నారు, అలాగే అనుకున్న సమయానికి పూర్తి చేసి విడుదల చేస్తున్నారు. శ్రీ కాంత్ నటించిన ‘లక్కీ’ సినిమా ఈ నెల 1న విడుదలయ్యింది. ఈ సినిమా కాకుండా శ్రీకాంత్ ప్రస్తుతం ‘దేవరాయ’, ‘శత్రువు’ ‘సేవకుడు’ మరియు ‘షాడో’ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న శ్రీ కాంత్ ఇప్పుడు మరో కొత్త సినిమాని ఒప్పుకున్నారు. గతంలో ‘పెళ్లి కాని ప్రసాద్’ సినిమా తీసిన ద్వారపూడి సత్యనారాయణ ఈ కామెడీ ఎంటర్టైనర్ కి దర్శకత్వం వహించనున్నారు. పుష్యమి ఫిల్మ్ మేకర్స్ పతాకంపై బెల్లం రామకృష్ణా రెడ్డి నిర్మిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘ అందరికీ ఎప్పటికీ గుర్తుండి పోయే సినిమాలు తీయాలనే ఉద్దేశంతో ఈ బ్యానర్ ని స్థాపించాము. మా డైరెక్టర్ కథ చెప్పగానే సింగల్ సిట్టింగ్లో శ్రీకాంత్ ఒప్పుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ నెలాఖరులో చిత్రీకరణ మొదలవుతుందని’ ఆయన అన్నారు. మిగిలిన నటీనటుల వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.

Exit mobile version