ఖరారైన వరుణ్ తేజ్ మొదటి సినిమా ముహూర్తం

ఖరారైన వరుణ్ తేజ్ మొదటి సినిమా ముహూర్తం

Published on Feb 25, 2014 2:44 AM IST

srikanth-addala-vaun-tej
నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ సినిమాలో నటిస్తున్నాడు అని ప్రకటించగానే అది టాక్ ఆఫ్ ద టౌన్ గా నిలిచింది. ఈ సినిమాను శ్రీకాంత్ అడ్డాల తీస్తున్నాడు అనగానే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి హిట్ ఇచ్చాడు కాబట్టి ఈ వార్త ఇంకా పాపులర్ అయ్యింది

ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ను అంతర్వేదిలో దేవుడి ముందు వుంచి ప్రార్ధనలు చేశారు. ఆయనతోపాటు నల్లమలపు బుజ్జి కూడా అక్కడకు వెళ్లారు. ఈ సినిమాను టాగూర్ మధు సహ నిర్మాత. ఈ నెల 27నా జరుగున్న ఈ ముహూర్తంలో మెగా ఫ్యామిలీ మొత్తం హాజరుకానున్నారు. మిక్కీ జె మేయర్ సంగీత దర్శకుడు. ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం

తాజా వార్తలు