మరోసారి రామ్ చరణ్ తో నటించనున్న షేర్ ఖాన్

మరోసారి రామ్ చరణ్ తో నటించనున్న షేర్ ఖాన్

Published on Dec 9, 2012 4:13 AM IST


ఈ మధ్య కాలంలో శ్రీహరి బలమయిన సహాయక పాత్రలతో ప్రేక్షకుల మెప్పు పొందుతూ వస్తున్నారు. “మగధీర” చిత్రంలో శ్రీహరి “షేర్ ఖాన్” పాత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోయిన పాత్ర . రామ్ చరణ్ మరియు శ్రీహరి మధ్యన సన్నివేశాలు చిత్రానికే ప్రధాన ఆకర్షణగా మారాయి. “కో అంటే కోటి” చిత్ర ఆడియో విడుదల సందర్భంగా వీరిద్దరూ ఒకే వేదిక మీదకు వచ్చారు . “జంజీర్” చిత్రంలో శ్రీ హరి ఒక కీలక పాత్రలో కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయం గురించి మరిన్ని విశేషాలు త్వరలో వెల్లడిస్తారు. ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్,సోను సూద్ మహి గిల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మధ్యనే హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం త్వరలో మరో షెడ్యూల్ మొదలు పెట్టుకోనుంది. అపూర్వ లఖియ దర్శకత్వం వహిస్తుండగా అమిత్ మెహ్ర నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2013 వేసవిలో విడుదల కానుంది.

తాజా వార్తలు