శ్రీదేవి హాలీవుడ్ లో నటించనుందా??

Sridevi
భారతీయ చిత్ర సీమలో శ్రీదేవి స్థానాన్ని భర్తీ చేసేవారు వుండరు. ఒకానకొక సమయంలో చాలా మంది అబ్బాయిలకు ఆమె కలల నాయిక. ఆమె రెండో ఇన్నింగ్స్ గా తెరకెక్కిన ‘ఇంగ్లీష్ వింగ్లిష్’ పెద్ద విజయం సాధించింది.

ఆమెకు చాలా చోట్ల నుండి ఆఫర్లు వస్తున్నాయి. తాజా సమాచారం ‘ప్రకారం కౌబాయ్స్ అండ్ ఇండియన్స్’ అనే హాలీవుడ్ సినిమాలో మెరిల్ స్ట్రిప్ తో కలిసి ప్రధానపాత్రను పోషించే అవకాశం వచ్చిందట. ఇంకా ఈ ప్రాజెక్ట్ మీద ఆమె సంతకం చెయ్యలేదు. బోనీ కపూర్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం వారి కూతురు జాహ్నవి ఈ స్క్రిప్ట్ ను పరిశీలిస్తుందని ఆమెకు నచ్చితే ఒప్పుకుంటామని తెలిపారు

కోన వెంకట్ వినిపించిన ఒక స్క్రిప్ట్ కుడా శ్రీదేవి చేతిలో వుంది. ఎ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు. వయసుతో సంబంధంలేకుండా ఆమెకు వున్న క్రేజ్ అసామాన్యం అనే చెప్పాలి

Exit mobile version