టొరోంటొ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్న శ్రీదేవి,సిద్దార్థ్ మరియు శ్రియ

టొరోంటొ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్న శ్రీదేవి,సిద్దార్థ్ మరియు శ్రియ

Published on Sep 11, 2012 1:58 AM IST


ప్రపంచంలో ప్రఖ్యాతగాంచిన ఫిలిం ఫెస్టివల్ లో తెలుగు నటులు కనిపించడం చాలా అరుదు. ఇలాంటి ఫెస్టివల్స్ లో తెలుగు చిత్రం కనిపించడం ఇంకా అరుదు. కాని ఇప్పుడు ఏ తెలుగు చిత్రం లేకపోయినా ముగ్గురు తెలుగు వారికి ప్రఖ్యాత టొరోంటొ ఫిలిం ఫెస్టివల్ ఆహ్వానం అందింది. కెనడాలో జరగనున్న ఈ ఫెస్టివల్ కి శ్రీ దేవి,శ్రియ మరియు సిద్దార్థ్ పాల్గొంటున్నారు. ఇప్పటికే సిద్దార్థ్ మరియు శ్రియ “మిడ్ నైట్ చిల్డ్రన్” చిత్ర ప్రిమియర్ లో పాల్గొన్నారు. శ్రీదేవి రేపు టొరంటొ బయలుదేరనున్నారు. శ్రీదేవి నటించిన “ఇంగ్లీష్ వింగ్లిష్” చిత్రం అక్కడ ప్రదర్శింపబడుతుంది.ఇదిలా ఉండగా అనుపం ఖేర్ మరియు షబానా అజ్మి లాంటి గొప్ప నటులతో కలిసి సిద్దార్థ మరియు శ్రియ ఈ ప్రిమియర్ లో పాల్గొన్నారు. ఈ చిత్రం మీద భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రం ఒక పుస్తకాన్ని ఆధారంగా తీసుకొని రచించారు ఈ పుస్తక రచయిత సల్మాన్ రష్దీ పశ్చిమంలో ప్రముఖ రచయిత. “ఇంగ్లీష్ వింగ్లిష్” చిత్రం టొరోంటొ ఫిలిం ఫెస్టివల్ లో ప్రధాన బహుమతి కోసం పోటీ చేస్తుంది.

తాజా వార్తలు