ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఈసారి ఏడాదిలో కూడా మంచి రసవత్తరంగానే స్టార్ట్ అయ్యింది అని చెప్పాలి. మెయిన్ గా టాప్ జట్లు అన్నీ ఆరంభమే భారీ లెవెల్లో ఇచ్చారు. ఈ సీజన్ SRH కి చాలా అప్-అండ్-డౌన్స్ తో నడిచింది. బాటింగ్‌లో రికార్డ్ బ్రేకింగ్ స్కోర్లు, కొన్ని మ్యాచుల్లో బ్యాట్స్‌మెన్ గొప్పగా ఆడారు. కానీ అదే నిలకడ లేకపోవడం, బౌలింగ్‌లో కొంత వెనుకబడటం వల్ల ప్లే ఆఫ్స్ కి చేరుకోలేకపోయారు.
ఫైనల్ పొజిషన్: 6వ స్థానం (13 పాయింట్లు: 6 విజయాలు, 7 ఓటములు, 1 నో రిజల్ట్)
హైలైట్: SRH ఐపీఎల్ హిస్టరీలో టాప్ 4 హయ్యెస్ట్ స్కోర్లు చేసిన మొదటి టీమ్. ఇందులో రెండు స్కోర్లు ఈ సీజన్‌లోనే వచ్చాయి.
ఓపెనింగ్ & క్లోజింగ్: మొదటి మ్యాచ్లో 286/6 (vs RR), చివరి మ్యాచ్లో 278/3 (vs KKR) ఇవి IPL హిస్టరీ లోనే రెండవ, మూడవ అత్యధిక స్కోర్లు.
బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్
SRH బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్. మొదటి నుంచి అటాక్ చేస్తూ భారీ స్కోర్లు చేశారు.
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసన్ లాంటి ప్లేయర్లు స్టార్ట్‌లోనే మ్యాచు SRH వైపు తిప్పారు.
హైలైట్స్:
హెన్రిచ్ క్లాసన్ : KKR మీద 105* (39 బాల్స్‌లో), ఈ సీజన్ ఫాస్టెస్ట్ సెంచరీ (37 బాల్స్‌లో). మొత్తం 487 రన్స్, స్ట్రైక్ రేట్ 172.70తో ఆడాడు.
ట్రావిస్ హెడ్ : స్టార్ట్‌లోనే పవర్‌ఫుల్ ఇన్నింగ్స్‌లు. 76 (40 బాల్స్‌లో), 102 (41 బాల్స్‌లో).
అభిషేక్ శర్మ: ఫాస్ట్ స్టార్ట్స్ ఇచ్చాడు. 439 రన్స్, స్ట్రైక్ రేట్ 193.39.
ఇషాన్ కిషన్: మధ్యలో స్టెడీగా ఆడి, కొన్ని మ్యాచుల్లో గుడ్ స్కోర్లు చేశాడు.
బౌలింగ్ పెర్ఫార్మెన్స్
జట్టు సారధి ఫ్యాట్ కమ్మిన్స్ అనుభవంతో లీడ్ చేశాడు. టైట్ బౌలింగ్‌తో బ్రేక్‌త్రూ ఇచ్చాడు.
హర్షల్ పటేల్ డెత్ ఓవర్లలో వికెట్లు తీసాడు.
ఇషాన్ మలింగా, జయదేవ్ ఉనద్కట్ కూడా కొన్ని మ్యాచుల్లో బాగున్నారు.
వీక్‌నెస్సెస్:
పవర్‌ప్లే, డెత్ ఓవర్లలో స్పెషలిస్ట్ బౌలర్లు లేకపోవడం వల్ల ఎక్కువ రన్స్ ఇచ్చారు.
బ్యాటింగ్ హై స్కోర్లు చేసినా, బౌలింగ్‌లో కంసిస్టెన్సీ లేకపోయింది.
బెస్ట్ పికింగ్ ఆటగాళ్లు:
హెన్రిచ్ క్లాసన్: ఎప్పుడూ అటాక్, మ్యాచు విన్నింగ్ ఇన్నింగ్స్‌లు.
ట్రావిస్ హెడ్: టాప్‌లో స్ట్రాంగ్ స్టార్ట్స్.
అభిషేక్ శర్మ: పవర్‌ఫుల్ ఓపెనర్, ఫాస్ట్ స్కోర్లు.
ఫ్యాట్ కమ్మిన్స్: బౌలింగ్, కెప్టెన్సీతో లీడ్ చేశాడు.
ఇషాన్ మలింగా: యంగ్ బౌలర్, మంచి టాలెంట్ చూపించాడు.
చెత్త పెర్ఫార్మర్స్:
మిడిల్ ఆర్డర్: Klaasen తప్ప మిగతా ప్లేయర్లు కంసిస్టెంట్‌గా రన్ చేయలేదు.
బెంచ్ స్ట్రెంగ్త్: బ్యాకప్ ప్లేయర్లు స్ట్రాంగ్‌గా లేరు.
బౌలింగ్ స్పెషలిస్ట్‌లు: పవర్‌ప్లే, డెత్ ఓవర్లలో స్పెషలిస్ట్ బౌలర్లు లేకపోవడం వల్ల ప్రాబ్లెమ్స్.
సీజన్ టేక్ అవేస్
అటాక్ బ్యాటింగ్: 250+ స్కోర్లు చేయడం SRH స్టైల్ అయింది. కానీ కొన్ని మ్యాచుల్లో ఇది రిస్క్ అయింది.
లాస్ట్ మ్యాచెస్‌లో గుడ్ పెర్ఫార్మెన్స్: చివరి 6 మ్యాచుల్లో 4 గెలిచారు (ఒకటి వర్షం వల్ల క్యాన్సిల్).
యంగ్ టాలెంట్: హర్ష దూబే, ఇషాన్ మలింగ లాంటి ప్లేయర్లు ఫ్యూచర్‌లో హెల్ప్ అవుతారు.
SRH 2025 సీజన్‌లో బ్యాటింగ్ రికార్డ్స్ బ్రేక్ చేశారు, కానీ కంసిస్టెన్సీ, డెప్త్ లో కొంత వెనుకబడ్డారు. కొంచెం మార్పులు, బెంచ్ స్ట్రెంగ్త్ పెంచితే వచ్చే సీజన్‌లో టైటిల్ కోసం పోటీ పడే ఛాన్స్ డెఫినెట్ గా ఉంది.