ఫుల్ స్వింగ్ లో శ్రీవిష్ణు.. డిఫరెంట్ సబ్జెక్టులతో నెక్స్ట్ 3 సినిమాలు..

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి టాలెంటెడ్ అండ్ వెర్సటైల్ యంగ్ హీరోస్ లో శ్రీవిష్ణు కూడా ఒకరు. రీసెంట్ చిత్రం ‘స్వాగ్’ మూడు డిఫరెంట్ షేడ్స్ ని అద్భుతంగా పండించిన శ్రీవిష్ణు ఇపుడు “సింగిల్” సినిమాతో ఎంటర్టైన్ చేసేందుకు రాబోతున్నాడు. అయితే తన నుంచి రానున్న రోజుల్లో మరిన్ని సాలిడ్ ప్రాజెక్ట్ లు అది కూడా దేనికదే సెపరేట్ కాన్సెప్ట్ లతో అలరించే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాడు.

మరి తన నెక్స్ట్ మూడు సినిమాలు కూడా ఇంట్రెస్టింగ్ జానర్స్ లో రాబోతున్నాయి. తెలుగు ఆడియెన్స్ కి ఎంతో ఇష్టమైన అమృతం సీరియల్ దర్శకుడు గుణ్ణం గంగరాజు బ్యానర్ లో ‘మృత్యుంజయ’ అనే సినిమా చేస్తుండగా ఇది ఆల్రెడీ 30 రోజులు షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యిందట.

ఇక ఈ చిత్రం కాకుండా ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని తాను ప్లాన్ చేస్తుండగా ఇవి కాకుండా ఒక ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయనున్నట్టుగా తెలిపాడు. ఇలా మొత్తం మూడు సినిమాలు తాను ప్లాన్ చేస్తుండగా ఇపుడు వస్తున్న సింగిల్ కాకుండా మిగతా మూడు చిత్రాలు వచ్చే ఏడాది వేసవి నాటికి రిలీజ్ అవుతాయని చెబుతున్నాడు. మరి మొత్తానికి మాత్రం శ్రీవిష్ణు ఇపుడు ఫుల్ స్వింగ్ లో కొనసాగుతున్నాడని చెప్పాలి.

Exit mobile version