‘పెద్ది’లో కిసుక్కు అనిపించే బ్యూటీ..?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పెద్ది’పై ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాలో రామ్ చరణ్ పూర్తి రగడ్ లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా సినీ సర్కిల్స్‌లో ఓ ఇంట్రెస్టింగ్ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఓ అదిరిపోయే మాస్ మసాలా సాంగ్ ఉండనుందని తెలుస్తోంది. ఈ స్పెషల్ సాంగ్‌లో ‘కిస్సిక్’ అంటూ నేషన్‌ను షేక్ చేసిన యంగ్ బ్యూటీ శ్రీలీల డ్యాన్స్ చేయబోతుందనే వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే పుష్ప-2 మూవీలో అమ్మడి పాటకు యమ క్రేజ్ దక్కింది.

దీంతో ఇప్పుడు మరోసారి ఈ బ్యూటీతో బుచ్చిబాబు సాలిడ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలను లైనప్ చేస్తున్న ఈ బ్యూటీ, పెద్ది కోసం మరోసారి స్పెషల్ అవతారం ఎత్తుతుందా లేదా అనేది చూడాలి.

Exit mobile version