తొలిసారి ఆ ఫీట్ చేస్తున్న శ్రీలీల

తొలిసారి ఆ ఫీట్ చేస్తున్న శ్రీలీల

Published on Nov 18, 2025 7:00 PM IST

యంగ్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఆమె రీసెంట్‌గా ‘మాస్ జాతర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఆ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేదు. ఇక ఆమె ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం తన తొలి తమిళ చిత్రంపై పెట్టింది. హీరో శివ కార్తికేయన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘పరాశక్తి’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

అయితే, ఈ సినిమాతో తమిళ్‌లో ఎంట్రీ ఇస్తున్న శ్రీలీల తన పాత్ర కోసం తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటోంది. ఇప్పటికే ఆమె డబ్బింగ్ వర్క్ కూడా ప్రారంభించింది. దీనికి సంబంధించి మేకర్స్ తాజాగా ఓ వీడియోను రిలీజ్ చేశారు.

ఇలా తన తొలి తమిళ సినిమాకే తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటుండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాను లేడీ డైరెక్టర్ సుధా కొంగర డైరెక్ట్ చేస్తున్నారు. 2026 సంక్రాంతి బరిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

తాజా వార్తలు