ఆఫీషియల్ : శ్రీ విష్ణు ‘సింగిల్’ రిలీజ్ డేట్ ఇదే!

యంగ్ హీరో శ్రీ విష్ణు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సింగిల్’ ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ వీడియో, సింగిల్ సాంగ్ మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. తాజాగా ఈ మూవీ ఆఫీషియల్ రిలీజ్ డేట్ ని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని మే 9న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ తెలిపారు.

ఈ సినిమా లో కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. కార్తీక్ రాజు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Exit mobile version