ఓటిటి సమీక్ష: ‘దొరికిన ప్రేమలేఖ’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో

ఓటిటి సమీక్ష: ‘దొరికిన ప్రేమలేఖ’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో

Published on Aug 11, 2025 10:48 AM IST

Dorikina Premalekha

విడుదల తేదీ : ఆగస్టు 10, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : సిద్ధూ దివాకర్, విరాజిత, స్రవంతి చొక్కారపు తదితరులు.
దర్శకత్వం : కొండా రాంబాబు
నిర్మాత : వీన్ యాట
సంగీతం : మిక్కిన్ అరుళ్ దేవ్
సినిమాటోగ్రఫీ : ప్రకాష్ కోట్ల
ఎడిటింగ్ : రాఘవేంద్ర వర్మ

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

ప్రతి వారంలో లానే ఈ వారం కూడా మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ లో ప్రసారం అవుతున్న వీక్లీ సిరీస్ కథా సుధా నుంచి స్ట్రీమింగ్ కి వచ్చిన మరో ఎపిసోడ్ నే ‘దొరికిన ప్రేమలేఖ’. మరి ఈ ఎపిసోడ్ ఎలా ఉందో చూద్దాం.

కథ:

పెళ్ళై రెండేళ్లు అయ్యిన ఓ యంగ్ కపుల్ రాహుల్ (సిద్ధూ దివాకర్) అనిత (విరాజిత) తమ దాంపత్య జీవితంలో అంత బాగుండరు. అనిత తన భర్త నుంచి ప్రేమ ఆశిస్తుంది కానీ రాహుల్ మాత్రం ఆమె పట్ల భాద్యత చూపిస్తాడు కానీ ప్రేమ చూపించడు. ఈ క్రమంలో అనితకి ఓ రోజు తమ ఇంట్లో రాహుల్ దాచిపెట్టిన ప్రేమలేఖ అనుకోకుండా దొరుకుతుంది. అందులో తన భర్త మాజీ ప్రేయసి మేఘన (స్రవంతి చొక్కారపు) కోసం తెలుసుకుంటుంది. ఇక్కడ నుంచి కథ ఎలా మారింది. మళ్ళీ రాహుల్ జీవితంలోకి వచ్చిన మేఘన ఏం చేసింది? చివరికి ఎవరు ఎవరితో కలిశారు అనేది మిగతా కథ.

ప్లస్ పాయింట్స్:

ఈ ఎపిసోడ్ లో కనిపించిన యంగ్ నటీనటులు మంచి పెర్ఫామెన్స్ లు అందించారు అని చెప్పాలి. ముఖ్యంగా స్రవంతి చొక్కారపు, విరాజిత తమ పాత్రల్లో చాలా బాగున్నారు. తమ లుక్స్ పరంగా కానీ నటన పరంగా కానీ బాగా ఆకట్టుకున్నారు. ఇక వీరితో పాటుగా సిద్ధూ దివాకర్ తన పాత్రలో బాగా చేసాడు. తన లుక్స్ బాగున్నాయి.

ఈ ఎపిసోడ్ లో టచ్ చేసిన లైన్ కొన్ని సీన్స్ ప్రెజెంట్ జెనరేషన్ లో ఉన్న యువ దంపతులకి కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రెజెంట్ పెళ్లి, లైఫ్ అందులో మాజీ ప్రేమలు ఉంటే ఎలా ఉంటుంది అనే అంశం ఓకే అనిపిస్తుంది.

మైనస్ పాయింట్స్:

మొదటగా చెప్పాలంటే ఈ ఎపిసోడ్ లో కథనం మరీ అంత ఎగ్జైటెడ్ గా ఏమీ సాగదు. చాలా సింపుల్ లైన్ అంతే సింపుల్ కథనం ఈ ఎపిసోడ్ లో కనిపిస్తుంది. మొత్తం 35 నిమిషాల నిడివి ఎపిసోడ్ లో చాలా సోసో గా మూమెంట్స్ నడుస్తాయి. దీనితో ఏమన్నా కొత్తగా లేదా ఇంట్రెస్టింగ్ గా ఆశించేవారికి నిరాశ కలగవచ్చు.

ఈ తరహాలో కథా కథనాలు కేవలం కొంతమందికి మాత్రమే కనెక్ట్ కావచ్చు. సో మిగతా ఆడియెన్స్ కి ఈ ఎపిసోడ్ అంత ఆసక్తిగా ఏమి అనిపించదు. ఉన్న తక్కువ ఎపిసోడ్ లో కూడా పెద్దగా ఆసక్తిగా సాగకపోవడం మూలాన కథనం అలా సాగదీతగా అనిపిస్తుంది.

సాంకేతిక వర్గం:

ఈ ఎపిసోడ్ లో మేకర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లాన్ చేసుకున్న సెటప్ నీట్ గా ఉంది. కెమెరా వర్క్, సంగీతం కూడా నీట్ గా ఉన్నాయి. ఎడిటింగ్ కొంచెం ఫాస్ట్ పేస్ లో చేయాల్సింది. ఇక దర్శకుడు కొండా రాంబాబు విషయానికి వస్తే తన వర్క్ బిలో యావరేజ్ గా ఉందని చెప్పాలి. వైఎస్ స్క్రీన్ ప్లే ఇంకొంచెం బెటర్ గా ట్రై చేస్తే బాగున్ను.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ ‘దొరికిన ప్రేమలేఖ’ స్లోగా సాగే రొటీన్ లవ్ షార్ట్ ఫిల్మ్ అని చెప్పాలి. నటీనటులు షైన్ అయ్యారు కానీ ఇందులో మరీ ఆసక్తిగా చూసే అంశాలు లేవు. కేవలం కపుల్స్ వరకు ఓకే అనిపిస్తుంది తప్ప మిగతా ఆడియెన్స్ ఈ ఎపిసోడ్ ని స్కిప్ చేసినా పర్లేదు.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team 

తాజా వార్తలు