అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమాలో బ్రహ్మాండమైన డాన్సులు

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమాలో బ్రహ్మాండమైన డాన్సులు

Published on Mar 13, 2012 10:11 AM IST


ప్రస్తుతం ఇండస్ట్రీలో బాగా డాన్స్ చేయగల యువ హీరోలలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. ప్రస్తుతం అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇలయన హీరొయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రంలో డాన్సుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. సోనుసూద్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూన్లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి టైటిల్ ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు.

తాజా వార్తలు