ఎన్టీఆర్ ‘డ్రాగన్‌’ కోసం స్పెషల్ సెట్ ?

ఎన్టీఆర్ ‘డ్రాగన్‌’ కోసం స్పెషల్ సెట్ ?

Published on Jun 1, 2025 3:01 PM IST

ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న సినిమా పై రోజుకొక రూమర్ వినిపిస్తోంది. ఐతే, తాజాగా ఈ సినిమా గురించి వినిపిస్తున్న అప్ డేట్ ప్రకారం జూన్ మూడో వారం నుంచి ఓ ప్రత్యేక సెట్ లో ఎన్టీఆర్ పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తారట. అందుకోసం ఓ ప్రత్యేక సెట్ ను కూడా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సెట్ లో ఓ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేస్తారని తెలుస్తోంది. సినిమా మొత్తానికే ఈ సన్నివేశాలు మెయిన్ హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. ఈ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ తో పాటు ప్రకాష్ రాజ్ మరియు మిగిలిన నటీనటులు కూడా పాల్గొంటారట.

ఇక ఈ మూవీ టైటిల్ ‘డ్రాగన్‌’ అని ప్రచారంలో ఉంది. ఐతే, ‘డ్రాగన్‌’ సినిమాని ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా చేయాలని ప్రశాంత్ నీల్ ప్రయత్నం చేస్తున్నాడట. అందుకే, ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ప్రశాంత్ నీల్ చాలా టైమ్ తీసుకున్నాడు. కాబట్టి, ఇప్పటి వరకూ ప్రశాంత్ నీల్ తీసిన అన్ని సినిమాల్లోకల్లా బెస్ట్ సినిమా ఇదే అవుతుందని అంచనాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు