‘రచ్చ’ లేపబోతున్న ఐపి మాన్ ఫైట్ సన్నివేశాలు

‘రచ్చ’ లేపబోతున్న ఐపి మాన్ ఫైట్ సన్నివేశాలు

Published on Mar 6, 2012 8:16 AM IST


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘రచ్చ’ చిత్రంలో కొన్ని అధ్బుతమైన యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయి. ముఖ్యంగా చైనా లోని బాంబూ ఫారెస్ట్ లో చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు సినిమాకు హైలెట్ గా నిలవనున్నాయని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. చైనాలో భారీ హిట్ సాధించిన ‘ఐపి మాన్’ పని చేసిన ఫైట్ మాస్టర్స్ ఈ యాక్షన్ సన్నివేశాలను తీర్చిదిద్దారు. ఆ సినిమాలోని కొన్ని యాక్షన్ సన్నివేశాలు కూడా ఈ చిత్రం కోసం వాడినట్లు యూనిట్ సభ్యుడొకరు చెబుతున్నారు. రచ్చ చిత్రం ఈ ఏడాది వేసవిలో విడుదలకు సిద్ధమవుతుండగా సంపత్ నంది ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా హీరొయిన్.

తాజా వార్తలు