“బిగ్ బాస్ 4” షూట్..నాగ్ విషయంలో భారీ మార్పులు.!

“బిగ్ బాస్ 4” షూట్..నాగ్ విషయంలో భారీ మార్పులు.!

Published on Jul 22, 2020 10:05 PM IST

మన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ నాల్గవ సీజన్ మొదలు కానుంది అని ఆ షోను టెలికాస్ట్ చేసే స్టార్ మా ఛానెల్ వారు ఖరారు చేసేసారు. అలాగే ఎక్స్ క్లూజివ్ గా ఈ షోకు సంబంధించిన విశేషాలు కూడా తెలిసాయి. అందులో కీలకమైన పాయింట్ ఒకటి కింగ్ నాగార్జున మళ్ళీ ఈ షోకు హోస్టింగ్ చెయ్యడం. అయితే ఇప్పుడు నెలకొన్న పరిస్థితుల రీత్యా ఈ షో లో కనిపించేందుకు కింగ్ నాగార్జున బిగ్ బాస్ యాజమాన్యానికి పలు సూచనలు చేశారట.

అందుకు తగ్గట్టుగానే వారు ఈసారి షో ప్రాసెస్ లో భారీ మార్పులు చేర్పులు చేయనున్నట్టుగా సమాచారం. నాగార్జున కనిపించే సెట్ ను స్పెషల్ గా డిజైన్ చెయ్యడమే కాకుండా వచ్చే కంటెస్టెంట్స్ విషయంలో ఎవరితో కూడా నేరుగా ఇంట్రాక్ట్ అయ్యే అవకాశం ఉండకూడదని తెలిపారట.

అలాగే బ్రేక్ టైం లో నాగార్జున ఒక్కరే ఒక చోట ఉండేలా మరో స్పెషల్ రూమ్ కు సంబంధించి అరేంజ్మెంట్స్ కూడా చేయనున్నారట. ఇక అలాగే ఫైనల్ గా ఎప్పుడూ హోస్ట్ వీకెండ్ లో రెండు సార్లు కనిపించే హోస్ట్ కేవలం ఒకే ఒక్క రోజు కనిపించనున్నారట. అంటే నాగార్జున వారానికి ఒక్కసారే షూటింగ్ కు వచ్చి పాల్గొంటానని వారితో చెప్పారట. మరి ఈసారి బిగ్ బాస్ షో ఎలా ఉండనుందో చూడాలి.

తాజా వార్తలు