న్యాచురల్ స్టార నాని నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ది ప్యారడైజ్’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్‌లో క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో నాని నెవర్ బిఫోర్ లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఇటీవల ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఇక తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ సర్‌ప్రైజ్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఓ ఇంటెన్స్ షెడ్యూల్‌ను పూర్తి చేసిన సందర్భంగా ఈ వీడియోను వారు రిలీజ్ చేశారు. ఇక జైలులో నాని చేసే యాక్షన్ సీక్వెన్స్ ఈ షెడ్యూల్‌లో షూట్ చేశారు.
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈసారి నానితో మరింత యాక్షన్ చేయిస్తున్నట్లు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ‘జడల్‌ని ముట్టుకుంటే వాడికి సర్రుమంటది’అంటూ నాని పాత్రను శ్రీకాంత్ ఎలివేట్ చేస్తుండటంతో ఈ సినిమాలో నాని పాత్ర ఎంత వయొలెంట్‌గా ఉండబోతుందో అర్థమవుతుంది. ఇక ఈ ఇంటెన్స్ సీక్వెన్స్ ముగియడంతో, మేకర్స్ ఇప్పుడు తమ నెక్స్ట్ షెడ్యూల్ కోసం రెడీ అవుతున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి