డైరెక్టర్ పూరి జగన్నాథ్ బ్యాంకాక్ తర్వాత స్పెయిన్ తో ప్రేమలో పడినట్లు ఉన్నారు. ఆయన చివరిగా తీసిన ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాని ఎక్కువ భాగం స్పెయిన్ లోనే తీసారు. ప్రస్తుతం ఆయన నితిన్ తో చేస్తున్న ‘హార్ట్ అటాక్’ ని కూడా ఎక్కువ భాగం స్పెయిన్ లో షూట్ చేస్తున్నారు.
ఈ మధ్య కాలంలో చాలా భారీ బడ్జెట్ సినిమాలను ఎక్కువగా స్పెయిన్ లో షూట్ చేస్తున్నారు. ‘అత్తారింటికి దారేది’, ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాలను కూడా స్పెయిన్ లో షూట్ చేసారు. ఈ విషయాన్ని గమనించిన స్పానిష్ మీడియా వారు తమ ప్లేస్ లో షూటింగ్ చెయ్యడానికి మక్కువ చూపుతున్నారని తెలిపింది.
తాజాగా స్పానిష్ కి చెందిన న్యూస్ పేపర్స్ వారు, వెబ్ సైట్స్ వారు షూటింగ్ సమయంలో పూరి జగన్నాథ్ – నితిన్ ని కలిసి ఇంటర్వ్యూ చేసారు. ఆ ఫోటోలను నితిన్ స్టైలిస్ట్ అయిన నీరజ కోన పోస్ట్ చేసింది. పూరి జగన్నాథ్ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ఆద శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.