ఇద్దరమ్మాయిలతో స్పెయిన్ లో కాదు

ఇద్దరమ్మాయిలతో స్పెయిన్ లో కాదు

Published on Nov 1, 2012 8:17 AM IST


ఒకరేమో స్టైలిష్ స్టార్, మరొకరేమో జెట్ స్పీడ్ వేగంతో సినిమా పూర్తి చేసి చెప్పిన టైంకి రిలీజ్ చేయగల సత్తా ఉన్న డైరెక్టర్. అల్లు అర్జున్ హీరోగా, పూరి జగన్నాధ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘ఇద్దరమ్మాయిలతో’ చిత్ర షూటింగ్ ఈ నెల ప్రారంభం కావాల్సి ఉంది. మొదటగా ఈ సినిమా షూటింగ్ స్పెయిన్ లో ప్రారంభించాలనుకున్నారు. అయితే అనివార్య కారణాల వల్ల ఈ సినిమాని స్పెయిన్ లో షూట్ చెయ్యట్లేదు. ప్రస్తుతం చిత్ర యూనిట్ మరో లొకేషన్ అన్వేషణలో ఉన్నారు. రిచా గంగోపాధ్యాయ్, అమల పాల్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాని పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షవర్ అలీ మెయిన్ విలన్ గ నటిస్తున్న ఈ సినిమాలో కోట శ్రీనివాస రావు రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించబోతున్నారు.

తాజా వార్తలు