తండ్రి ఆరోగ్యం విషయంలో ఎమోషన్ అయిన ఎస్పీ చరణ్.!

గత కొన్ని రోజుల నుంచి లెజెండరీ సింగర్ ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం గారు కరోనా వైరస్ తో పోరాడుతూ చికిత్స పొందుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయిగ్స్ మొదటి వారంలోనే ఆయనకు కరోనా వచ్చిందని తెలిపి ఎవరినీ అధైర్య పడొద్దని చెప్పారు. అప్పుడు బాగానే ఉన్నా తర్వాత తర్వాత మాత్రం ఆయన ఆరోగ్యం మరింత స్థాయిలో క్షీణిస్తూ వచ్చింది. కొన్ని రోజుల కితం మళ్ళీ ఆయన ఆరోగ్యం కుదుటపడింది అని కుటుంబ సభ్యులే తెలిపారు.

కానీ ఇప్పుడు మళ్ళీ ఊహించని విధంగా ఆయన ఆరోగ్యం క్రిటికల్ గా మారింది అని ఆయన తనయుడు ఎస్ పి చరణ్ తెలిపారు. అలాగే నిన్న సాయంత్రం నాన్న గారి కోసం ప్రార్ధించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం విదేశీ వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారని తెలుపుతూ ఆయన ఆరోగ్యం పట్ల ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యిపోయారు. దీనితో మరోసారి ఆయన మళ్ళీ తిరిగి కోలుకంటారని బలంగా నమ్ముతున్నామని తెలిపారు.

Exit mobile version