రేపిస్టులను కఠినంగా శిక్షించాలన్న ఎస్.పి బాలు

రేపిస్టులను కఠినంగా శిక్షించాలన్న ఎస్.పి బాలు

Published on May 6, 2013 12:30 PM IST

ఫేమస్ లెజండ్రీ ప్లే బ్యాక్ సింగర్ ఎస్.పి బాలసుబ్రమణ్యం చాలా సున్నితంగా మాట్లాడే మనస్కుడని మనందరికీ తెలుసు. అందరితోనూ చాలా బాగుండే బాలు ఎప్పుడూ ఎవరిపైనా కామెంట్స్ చెయ్యలేదు. కానీ ఈ రోజు మహిళల పై దారుణంగా అత్యాచారాలు చేస్తున్న వారి గురించి చాలా కఠినంగా మాట్లాడారు.

” మహిళలపై, చిన్నపిల్లలపై అత్యాచారాలు చేసేవాళ్ళను పట్టుకొని కఠినంగా శిక్షించాలి. ప్రభుత్వం, ప్రజలు సామాజం పట్ల ఎంతో బాధ్యతగా వ్యవహరించాలని’ ఆయన అన్నారు. తిరుపతిలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమమలో బాలు గారు ఈ కామెంట్స్ చేసారు. అలాగే ‘మిథునం’ సినిమా సక్సెస్ గురించి అడిగినప్పుడు ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేసారు. అలాగే అప్పుడప్పుడు వచ్చే ఇలాంటి మంచి సినిమాలను ఆదరించాలని అన్నారు.

ఈ మధ్య జరిగిన ఓ కార్యక్రమంలో తెలుగులో వస్తున్నా డబ్బింగ్ సీరియల్స్ గురించి మాట్లాడుతూ ‘ డబ్బింగ్ సీరియల్స్ కి వ్యతిరేఖంగా ఆందోళన చేస్తున్న వారికి నేను సపోర్ట్ చేస్తున్నాను, వారు ఒక కొత్త కోణంలో ఆలోచించి ఈ సమస్యని పరిష్కరించుకోవాలన్నారు’.

తాజా వార్తలు