నిర్మలా సీతారామన్ కు ధన్యవాదాలు !

సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ధన్యవాదాలు తెలిపింది. విషయంలోకి వెళ్తే… టిడిఎస్ సమస్యలకు సంబంధించి.. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు సంబంధించిన ప్రముఖులు శ్రీమతి సుమలత, శ్రీ ప్రహ్లాద్ జోషి, శ్రీ కె. రఘురామ కృష్ణరాజు, మిస్టర్ కాట్రగడ్డ ప్రసాద్, మిస్టర్ డి.ఆర్. జైరాజ్, మిస్టర్ రాక్లైన్ వెంకటేష్, మిస్టర్ కె.సి.ఎన్ చంద్రశేకర్, మిస్టర్ కె. ఎల్. దామోదర్ ప్రసాద్ మరియు పలువురు ప్రముఖులు తమ సమస్యలను చర్చించి పరిష్కరించాలని నిర్మలా సీతారామన్ ను కోరారు.

కాగా సమస్యలను ఓపికగా విన్న ఆమె, కొన్ని కీలకమైన సమస్యలు ఉన్నాయని గౌరవ మంత్రి అర్థం చేసుకున్నారు. వాటిని పరిష్కరించుకోవాలంటే.. చిత్ర పరిశ్రమతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఆమె ఆదేశించారు. ఇక తమ సమస్యలను చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు గౌరవనీయ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రముఖులు ధన్యవాదాలు తెలిపారు.

Exit mobile version