భారతదేశంలో అత్యంత పారదర్శకమైన, ల్యాబ్-పరీక్షించిన, అమెరికా ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన హెల్త్ సప్లిమెంట్లను అందించేందుకు ‘ఆల్ఫాలీట్’ బ్రాండ్ మార్కెట్లోకి వచ్చింది. నగరంలోని ట్రైడెంట్ హోటల్‌లో జరిగిన గ్రాండ్ లాంచ్ వేడుకలో ‘ఇండియన్ రియల్ హీరో’ సోనూ సూద్ ముఖ్య అతిథిగా పాల్గొని బ్రాండ్‌ను ఆవిష్కరించారు. మిస్ ఇండియా మానస కూడా ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా హాజరయ్యారు.
సోనూ సూద్ మాట్లాడుతూ, “ఈ బ్రాండ్ ఫిట్‌నెస్‌కు సంబంధించిన సరైన, నాణ్యమైన సప్లిమెంట్లను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మార్కెట్లో కల్తీ ఉత్పత్తులు ఎక్కువగా ఉన్నందున వినియోగదారులు జాగ్రత్తగా ఎంచుకోవాలి” అన్నారు.
ఆల్ఫాలీట్ ఫౌండర్ & సీఈఓ సురేష్ శుక్లా మాట్లాడుతూ, “భారత మార్కెట్‌లో నమ్మకమైన, 100% అసలు, ల్యాబ్-టెస్టెడ్ సప్లిమెంట్ల కొరతను తీర్చేందుకు ఈ బ్రాండ్‌ను ప్రారంభించాం” అన్నారు. కో-ఫౌండర్ & సీఎఫ్ఓ శ్రవణ్ ఘంట ఈ బ్రాండ్ వ్యాపారం మాత్రమే కాకుండా ఆరోగ్య ఉద్యమమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఫిట్‌నెస్ నిపుణులు, హెల్త్ ఇన్‌ఫ్లుయెన్సర్లు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రస్తుతం #iamalphalete హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో ఈ లాంచ్ వేడుక వైరల్ అవుతోంది.