నాగార్జున “భాయ్” చిత్రంలో సోను సూద్

Sonu-Sood
“అరుంధతి” మరియు “దూకుడు” వంటి చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్న సోను సూద్ దాదాపుగా ఏడు సంవత్సరాల తరువాత నాగార్జునతో కలిసి చెయ్యనున్నారు. గతంలో “సూపర్ చిత్రంలో నాగార్జున స్నేహితుడిగా సోను సూద్ నటించారు. అప్పటి నుండి వీరు ఇదరు మంచి స్నేహితులయ్యారు ఆ చిత్రం తరువాత సోను సూద్ కి నాగార్జున తో నటించే అవకాశం లభించలేదు. తాజా సమాచారం ప్రకారం సోను సూద్ నాగార్జున “భాయ్” చిత్రంలో నటించనున్నారు. ఈ విషయం ఇంకా దృవీకరణ అవ్వలేదు కాని ఈ నటుడు ఈ చిత్రంలో నటించడానికి ఉత్సాహం చూపిస్తున్నట్టు తెలుస్తుంది. రిచా గంగోపాధ్యాయ్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుండగా వీరభద్రమ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద నాగార్జున నిర్మిస్తున్నారు. దేవిశ్రీ సంగీతం అందిస్తుండగా ఈ చిత్రం వచ్చే ఏడాది చిత్రీకరణ మొదలు పెట్టుకోనుంది.

Exit mobile version