తెలుగు ప్రతినాయిక పాత్రలో బాగా ప్రాచుర్యం పొందిన నటుడు “సోను సూద్” ఈ నటుడు ఇప్పుడు మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం పాత్రలో కనిపించబోతున్నాడు. “షూట్ అవుట్ అట్ వాడాలా” అనే చిత్రం లో సోను సూద్ ఈ పాత్రలో కనిపించబోతున్నారు ఈ చిత్రం లో జాన్ అబ్రహం మరియు అనిల్ కపూర్ ప్రధాన పాత్రలలో కనిపించబోతున్నారు. సంజయ్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. కంగనా రనౌత్ కథానాయిక పాత్రలో కనిపించబోతుంది ఈ చిత్రం 2007 లో వచ్చిన “షూట్ అవుట్ అట్ లోఖండ్వాల” చిత్రానికి కొనసాగింపు. చిత్ర కథ 1982 లో జరిగిన మొదటి ఎన్ కౌంటర్ చుట్టూ తిరుగుతుంది