మల్టీ ప్లెక్స్ లో విజిల్స్ చూసి షాక్ అయిన సోనాల్ చౌహాన్

Sonal-Chauhan
నందమూరి అభిమానులకు ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ‘లెజెండ్’. నందమూరి బాలకృష్ణ నటించిన ఈ సినిమా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకొని విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. రేపటి నుంచి ఈ చిత్ర టీం లెజెండ్ సింహా యాత్ర అనే పేరుతో విజయ యాత్ర మొదలు పెట్టనున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో హీరోయిన్ సోనాల్ చౌహాన్ మాట్లాడుతూ ‘మొదటి సారి ఆడియన్స్ తో కలిసి ఈ సినిమాని రెండు సార్లు చూసి ఎంతో ఎగ్జైట్ అయ్యాను. మల్టీ ప్లెక్సుల్లో కూడా ప్రతి 5 నిమిషాలకి విజిల్స్ వేస్తూ అరవడం చూసి షాక్ అయ్యాను. ‘లెజెండ్’ సినిమాలో నేను భాగమైనందుకు చాలా గర్వంగా ఉందని’ తెలిపింది.

అలాగే ఈ కార్యక్రామానికి హాజరైన డైరెక్టర్ బోయపాటి శ్రీను, నిర్మాతలు సినిమా విజయం పట్ల ఆనందాన్ని వ్యక్తపరిచారు.

Exit mobile version