బాలకృష్ణ సినిమాకి కన్ఫమ్ అయిన హీరోయిన్

sonal-chauhan

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శీను దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో ‘జన్నత్’ సినిమాలో నటించిన నటి సోనాల్ చౌహన్ హీరోయిన్ గా కన్ఫమ్ అయ్యింది. మరొక స్టార్ హీరోయిన్ కూడా ఈ సినిమాలో నటించనుంది. ఆ హీరోయిన్ ఎవరు అనేది కూడా త్వరలో తెలియజేసే అవకాశం ఉంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 15నుండి ప్రారంభంకానుంది. ఈ సినిమాలో బాలకృష్ణ పవర్ ఫుల్, ఎమోషినల్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ మొదటి సారిగా బాలకృష్ణ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. 14రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సాయి కొర్రపాటి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఈ సినిమా 2014 మొదట్లో విడుదయ్యె అవకాశం ఉంది

Exit mobile version