‘బాహుబలి’ సినిమా యొక్క హిందీ వెర్షన్లో సోనాక్షి సిన్హా నటిస్తుందన్న పుకారుని దర్శకుడు రాజమౌళి కొట్టిపారేసాడు. ప్రస్తుతం అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తుండగా మరో నాయికను ఖరారు చెయ్యవలసివుంది. ఈ సినిమాలో ప్రభాస్, రానా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం యొక్క ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రం షూటింగ్ ఈ యేడాది జూలై నుండి మొదలుకావచ్చు. ఇప్పటికే ఇందులో నటిస్తున్న నటులంతా గుఱ్ఱపు స్వారీలను, కత్తి పోరాటాలను శిక్షణ తీసుకున్నారు.
ఈ సినిమా చారిత్రాత్మక నేపధ్యంలో సాగే సినిమా. రామోజీ ఫిలిం సిటీలో ఆర్ట్ డైరెక్టర్ శిబు సిరైల్ భారీ సెట్లు వేస్తున్నారు. ఇప్పటివరకూ తెలుగు సినీ చరిత్రలో మునుపెన్నడూ చూడని ఘనమైన రీతిలో ఈ సినిమాను రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఆర్క మీడియా వర్క్స్ బ్యానర్ పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నాడు. కె రాఘవేంద్ర రావు ఈ సినిమాకు సమర్పకుడు. ఎం.ఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు. సెంథిల్ సినిమాటోగ్రాఫర్