“కేజీయఫ్ చాప్టర్ 2” షూట్ పై సాలిడ్ అప్డేట్.!

“కేజీయఫ్ చాప్టర్ 2” షూట్ పై సాలిడ్ అప్డేట్.!

Published on Oct 15, 2020 10:00 AM IST

ఇప్పుడు మన దక్షిణాది నుంచి ఇండియన్ బాక్సాఫీస్ పై దాడి చెయ్యడానికి రెడీ అవుతున్న భారీ పాన్ ఇండియన్ చిత్రాల్లో కన్నడకు చెందిన సెన్సేషనల్ చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2” ఒకటి. రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ పై తారాస్థాయి అంచనాలు అన్ని ఇండస్ట్రీలలో నెలకొన్నాయి.

అయితే ఎప్పుడో పూర్తి కావాల్సిన ఈ చిత్రం ఇపుడు లాక్ డౌన్ మూలాన వాయిదా పడాల్సి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ షూట్ పునః ప్రారంభం అయ్యింది కానీ ఈ చిత్రంలో ప్రధాన ప్రతినాయక పాత్ర పోషిస్తున్న అధీరా గా చేస్తున్న సంజయ్ దత్ పై మాత్రం షూట్ బ్యాలన్స్ ఉండిపోయింది. పైగా సంజయ్ ఆరోగ్యం ఆ మధ్య క్షీణించడంతో కాస్త ఆందళనాకర పరిస్థితులు నెలకొన్నాయి.

కానీ ఎట్టకేలకు సంజయ్ కోలుకున్నారు. పైగా ఇప్పుడు షూట్ కు కూడా ఆల్ సెట్ చేసేసారు. బాలీవుడ్ ఫేమస్ హైర్ స్టయిలిష్ట్ ఆలిం హకీమ్ దగ్గర కేజీయఫ్ చాప్టర్ 2 లోని హైర్ స్టైల్ లుక్ ను మరోసారి ప్రిపేర్ చేసి తాను షూట్ కు రెడీ అయ్యినట్టు కన్ఫర్మ్ చేసేసారు. ఇటీవలే యష్ పై కొన్ని కీలక షాట్స్ ను నీల్ తెరకెక్కించాడు. ఇపుడు సంజయ్ కూడా రెడీ కావడంతో ఈ ఇద్దరి సాలిడ్ రోల్స్ పై మిగిలి ఉన్న షాట్స్ ను రెడీ తెరకెక్కించడమే మిగిలి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు