‘అఖండ 2’ ప్రమోషన్స్ కి గట్టి ప్లానింగ్స్?

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “అఖండ 2 తాండవం”. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇంకొన్ని రోజుల్లో థియేటర్స్ లో తాండవం చేయనుంది. అయితే ఈ సినిమా కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చేలా పాన్ ఇండియా లెవెల్లో సాలిడ్ ప్లానింగ్స్ ని మేకర్స్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ప్రమోషన్స్ ని పాన్ ఇండియా లెవెల్లో పలు చోట్ల ప్రమోషనల్ ఈవెంట్స్ ని సెట్ చేస్తున్నారట. ముంబై, చెన్నై నార్త్ లో మరికొన్ని ముఖ్య ప్రాంతాల్లో చేయనున్నారట. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా 14 రీల్ ప్లస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ డిసెంబర్ 5న పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

Exit mobile version