వైవిధ్యమైన చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారిన హీరో అడివి శేషు ప్రస్తుతం ‘మేజర్’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న బయోపిక్ లో నటిస్తున్నారు. ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శోభితా ధూళిపాల కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోన్నారు. అయితే ఆమె పాత్ర సినిమాలో చాలా కీలకంగా చాలా ఎమోషనల్‌గా ఉంటుందట.
మొత్తానికి గూఢచారి తర్వాత శేష్ తో శోభితా ధూళిపాల కలిసి నటిస్తోన్న రెండో చిత్రమిది. ఆ రకంగా హిట్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అయింది. ఇక 2008 ముంబై టెర్రర్ అటాక్ లో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తన ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను ప్రాణాలను కాపాడారు. ఈ చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్, సోనీ పిక్చర్స్, ఎప్లస్ఎస్ మూవీస్ పతాకాలపై నిర్మితమవుతుంది.