పెళ్లి ప్రసార హక్కులు అమ్ముకున్న స్నేహ

పెళ్లి ప్రసార హక్కులు అమ్ముకున్న స్నేహ

Published on May 9, 2012 5:16 PM IST


ఫ్యామిలీ చిత్రాల కథానాయికగా పేరు తెచ్చుకున్న స్నేహ త్వరలో ఇల్లాలు కాబోతున్న విషయం తెల్సిందే. తన సహ నటుడు ప్రసన్నని పెళ్లి చేసుకోబోతుంది. నటిగా తానేంటో నిరూపించుకున్న స్నేహ తన పెళ్లిని క్యాష్ చేసుకునే పనిలో పడింది. తన పెళ్ళికి సంభందించిన ప్రసార హక్కుల్ని ఫాన్సీ రేటుకు విజయ టీవీకి ఇచ్చినట్లు సమాచారం. ఈ సంప్రదాయం మొదట్లో హాలీవుడ్లో ఉండేది. మెల్లిగా బాలీవుడ్లో కూడా కొనసాగుతోంది. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ పెళ్లి ప్రసార హక్కులు అత్యధిక రేటుకు అమ్ముడుపోయాయి. సౌత్లో కూడా ఈ సంప్రదాయం రావడం శుభ సూచకం అనే చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు