యాక్షన్ సినిమా చేయబోతున్న సుదీర్ బాబు

యాక్షన్ సినిమా చేయబోతున్న సుదీర్ బాబు

Published on Mar 19, 2012 3:07 PM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు బావ సుదీర్ బాబు హీరోగా రెండవ చిత్రానికి రంగం సిద్ధమైంది. గతంలో ‘రక్ష’ సినిమాకి దర్శకత్వం వహించిన ఆకెళ్ళ వంశి కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఒకరు నిర్మించనున్నారు. మొదటి చిత్రం ‘ఎస్ఎమ్ఎస్’ తోనే డాన్సులు మరియు ఫైట్స్ చేయడంలో తన ప్రత్యేక శైలిని చాటుకున్న సుదీర్ బాబు ఆ చిత్రం కమర్షియల్ గా మంచి విజయం సాధించడంతో రెండవ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. ఈ సినిమాకి ‘అగ్గి పుల్ల’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు సమాచారం.

తాజా వార్తలు